LORD KAPILESWARA RIDES ON VYAGRA VAHANAM_ వ్యాఘ్ర వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి విహారం
Tirupati, 2 Mar. 19: On day six of ongoing Brahmotsavams of Sri Kapileswara Swamy Temple Lord rode on Vyaghra Vahanam and blessed as devotees offered harati and bhajan troupes performed on the streets.
Bhakti enveloped devotees like a wild cat as Lords spirited presence after morning Snapana Thirumanjanam for utsava idols of Soma Skanda murti, Sri Kamakshi Ammavaru.
Later in the evening Lord will bless devotees on Gaja Vahanam.
Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Muni Chengalrayulu, Temple Inspector Sri Anil and others took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
వ్యాఘ్ర వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి విహారం
తిరుపతి, 2019 మార్చి 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన శనివారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయకనగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బ ందాల చెక్క భజనలు ఆకట్టుకున్నాయి.
భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు,మదమోహ, మాత్సర్యాదులు సంహరింపబడుతాయి. అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు గజవాహనం వైభవంగా జరుగనుంది. ఆద్యంతరహితుడైన శివదేవుని, ఐశ్వర్యసూచికమైన గజవాహనంపై దర్శించడం కోటిజన్మల తపఃఫలం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఇవో శ్రీ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.