PULSE POLIO IN TIRUPATI FROM MARCH 11-13_ మార్చి 11 నుండి 13వ తేదీ వరకు తిరుపతిలో పల్స్‌పోలియో
Tirupati, 10 March 2018: The pulse polio administration will be observed in Tirupati from March 11 to 13 for three days in different centres said, TTD CMO Dr D Nageswara Rao.
These centres are located at central hospital, srinivasam, Bairagipatteda, Alipiri, Alipir Bustand, Railway Station and function from 7am to 6pm on these days.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
మార్చి 11 నుండి 13వ తేదీ వరకు తిరుపతిలో పల్స్‌పోలియో
మార్చి 10, తిరుపతి, 2018: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో మార్చి 11 నుండి 13వ తేదీ వరకు మూడు రోజుల పాటు రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టిటిడి ముఖ్య వైద్యాధికారి డా|| నాగేశ్వరరావు తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
ప్రతిరోజూ ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు శిబిరాల్లో పోలియో చుక్కలు వేస్తారు. తిరుపతిలోని టిటిడి కేంద్రీయ వైద్యశాల, శ్రీనివాసం కాంప్లెక్స్, బైరాగిపట్టెడ వైద్య కేంద్రం, అలిపిరి, అలిపిరి బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలలో శిబిరాలను ఏర్పాటుచేశారు. ఇందుకోసం వైద్యసిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు, ఇతర సిబ్బంది సేవలందిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.