ANNAMAYYA VARDHANTI POSTERS RELEASED_ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

Tirupati, 10 March 2018: The 515th Aradhanotsavam posters of Saint Poet Sri Tallapaka Annamacharya were released by TTD EO Sri Anil Kumar Singhal in his chambers of TTD Administrative Building on Saturday.

The Annamacharya Vardhanti fete will be observed by Annnamacharya Project in a big way in Tallapaka, Tirumala and Tirupati from March 13 to 17. On March 14 there will be unjal seva in Narayanagiri Gardens between 6pm and 8pmwhile special lectures in Mahati up to March 17. Meanwhile special sankeertana gosti will be rendered everyday at 108 feet statue of Annamaiah at Tallapaka in YSR Kadapa District.

CVSO Sri Ake Ravikrishna, FACAO Sri Balaji, DyEOs Sri Gouthami, Sri Dhanajeyulu were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

మార్చి 10, తిరుపతి, 2018: సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాల గోడపత్రికలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.

మార్చి 13 నుండి 17వ తేదీ వరకు అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు జరుగనున్నాయి. మార్చి 13వ తేదీన టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవం నిర్వహిస్తారు. మార్చి 14వ తేదీన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గోష్టిగానం, సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. మార్చి 14 నుండి 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు, మహతి కళాక్షేత్రం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీకె.ధనంజయుడు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.