ఘనంగా శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి పంగుణోత్తర ఉత్సవం

ఘనంగా శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి పంగుణోత్తర ఉత్సవం

మార్చి 24, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గల శ్రీ పుండరీకవళ్లి (సాలైనాంచియార్‌) అమ్మవారి పంగుణి ఉత్తర ఉత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. మార్చి 30వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది.

ఈ సందర్భంగా ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి విశ్వరూప సర్వదర్శనం కల్పించారు. అనంతరం ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో సమర్పణ చేపట్టారు. సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారికి ఊంజల్‌సేవ అనంతరం శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ విమానప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీఉదయభాస్కర్‌, సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.