మార్చి 26న చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మార్చి 26న చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మార్చి 24, తిరుపతి, 2018: టిటిడి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 26వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరుగనుంది.

మార్చి 27న ధ్వజారోహణం :

ఆలయంలో మార్చి 27న ఉదయం 8 నుండి 9 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం చేస్తారు. సాయంత్రం ఘంటానాదం, ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. మార్చి 28, 29, 31, ఏప్రిల్‌ 2, 3వ తేదీల్లో సాయంత్రం ఘంటానాదం, ఊంజల్‌సేవ చేపడతారు. మార్చి 30న రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఏప్రిల్‌ 1న సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగనున్నాయి. ఏప్రిల్‌ 4న ఉదయం 9 నుండి 10 గంటల వరకు వసంతోత్సవం, ఉదయం 10.30 నుండి 11.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్‌ 5వ తేదీ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తారు.

టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.