PURANDHARA DASA ARADHANA COMMENCES _ అన్నమాచార్య కళామందిరంలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు
Tirupati, 31 Jan. 22: Sri Purandhara Dasa Aradhanotsavams commenced at Annamacharya Kalamandiram on Monday evening in Tirupati.
The Purandhara Dasa Sankeertans were performed by Dasa Mandalis between 6pm and 8pm.
The Dasa Sahitya Project Special Officer Sri Anandatheerthacharyulu and others were present.
On February 1 there will be garlanding of the statue of Sri Purandhara Dasa located at Alipiri at 6am.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
అన్నమాచార్య కళామందిరంలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు
తిరుపతి, 2022 జనవరి 31: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా భజన మండళ్ల కళాకారులు శ్రీపురందరదాస కీర్తనలను చక్కగా ఆలపించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు బృందాల వారీగా కళాకారులు దాస పదాలను గానం చేశారు. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 1న అలిపిరిలో పుష్పాంజలి
ఆరాధనోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 1న మంగళవారం ఉదయం 6 గంటలకు అలిపిరి వద్దగల శ్రీ పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.