PURUSAIVARI TOTOTSAVAM ON JULY 26_ జూలై 26వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tirupati, 21 July 2017: Purusaitototsavam, is a unique religious fete associated with the day of an ardent devotee of Sri Venkateswara Swmay, Sri Anantazhwan ascended to Paramapadam.

On this day, the processional deities of Sri Malayappa Swamy accompanied by his two Consorts Sridevi and Bhudevi will be taken to Sri Purusaivari Tota. Sri Anantazhwan (1053 AD) dedicated his102 years in the service of Sri Venkateswara through Pushpa kainkaryam.

To mark the contributions of this great Sri Vaishnava Saint, Purusaivari Tototsavam is performed every year in Tirumala. After reaching Vrindavan of Sri Anantazhwan, Astanam was performed to the processional deities. Later, the special garlands of Lord Malayappa were decorated to Pogada tree(Styphonolobium japanicum) representing Sri Anantazhwan.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 26వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

తిరుమల, 2017 జూలై 21: శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని జూలై 26వ తేదీన తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరుగనుంది.

పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ కారణంగా కటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ పవిత్రమైనరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేస్తారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇస్తారు. ఆ శేషహారతి, పుష్పసరము, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పిస్తారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచుతారు. అక్కడ నుంచి స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.