PURUSHAIVARI THOTA UTSAVA ON AUGUST 3 AT SRIVARI TEMPLE_ ఆగ‌స్టు 3వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

Tirumala, 28 Jul. 19: TTD plans to conduct Purushaivari Thota utsava to herald the Tiruvadipuram Sattu Mora Of Sri Andal ammavaru on August 3.

Legends say the Andal Thiruvadipuram Sattumora is held as Bhudevi alias Andal (Godavari Devi) was born on Purva Phalguni star on Shukla Chaturthi day of Ashada month.

As part of the program, the utsava idols of Sri Malayappaswamy along with consorts will be brought to Purusaivari theta and later after special puja and other rituals, the majestic caravan of Malayappaswamy will return to Srivari temple.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 3వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

తిరుమల, 2019 జూలై 28: శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి తిరువడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని ఆగ‌స్టు 3వ తేదీన తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరుగనుంది.

పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ కారణంగా కటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు. 

ఈ పవిత్రమైనరోజు సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేస్తారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇస్తారు. హారతి, పుష్పసరము, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పిస్తారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచుతారు. అక్కడ నుంచి స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.