PUSHKARINI CLEANSING FROM JULY 10 TO AUGUST_ జూలై 10 నుండి ఆగస్టు 9వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు

Tirumala, 7 July 2018: The cleaning of Swamy Pushkarini will be taken up by TTD water works department from July 10 onwards.

Usually, every year in connection with annual Brahmotsavams, the water works wing takes up cleaning of Pushkarini in the month of August.

But, as this year Astabandhana Balalaya Mahasamprokshanam is scheduled between August 12 and 16 and Annual Brahmotsavams commencing from September 13 onwards, TTD has taken up cleansing works a month before in July.

Meanwhile, the works will last till August 9. During this period , TTD has dispensed with rendering of Pushkarini harati.

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER,TIRUPATI

జూలై 10 నుండి ఆగస్టు 9వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు

జూలై 07, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు జూలై 10 నుండి ఆగస్టు 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శ్రీవారి సాకట్ల బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు.

ఈ ఏడాది ఆగష్టు 12 నుండి శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం, సెప్టెంబరు 13 నుండి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరుగనుంది. కావున టిటిడి వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. కావున ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు.

రోజుకు 20 వేల మంది భక్తులు పుష్కరిణి స్నానం

శ్రీవారి పుష్కరిణికి దాదాపు కోటి లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రతిరోజు సరాసరి 20 వేల మంది భక్తులు ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తుంటారు. భక్తులు రద్దీ ఉన్న రోజుల్లో దాదాపు 50 వేల మంది వరకు పుణ్య స్నానాలు చేస్తుంటారు.

పుష్కరిణి ప్రాశస్త్యం

గరుత్మంతుడు వైకుంఠం నుంచి స్వామి పుష్కరిణిని తీసుకొచ్చి ఇక్కడ కొలువుదీర్చాడని, సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో కలిసి ఈ పుష్కరిణిలో స్నానం చేశారని పురాణల ద్వారా తెలుస్తున్నాయి. స్వామి పుష్కరిణిలో భక్తులు అతిపవిత్రంగా భావించే ఏడు బావులున్నాయి. వీటిలో స్వామి పుష్కరిణితోపాటు రామ, గోమతి, మార్కండేయ, సరస్వతి, అగ్ని, యమ తీర్థాలున్నాయి. శ్రీవారి దర్శనానికి ముందు భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేయడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పుష్కరిణి స్నానంతో పాపాలు తొలగిపోయి స్వామివారి ఆశీస్సులతో సిరిసంపదలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

నిరంతరాయంగా రీ సైక్లింగ్‌

స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలో నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్‌ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. వార్షిక బ్రహ్మూెత్సవాల సందర్భంగా ఒక నెల రోజుట పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు.

పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు 10 హెచ్‌పి పంపుల సాయంతో 2.5 లక్షల లీటర్ల చొప్పున 24 గంటల పాటు నీటిని తొలగించి, మెట్లను శుభ్రం చేస్తారు. ఆ తరువాత 10 రోజులు మరమ్మత్తులు ఏవైన ఉంటే పూర్తి చేస్తారు. చివరి 10 రోజులు పుష్కరిణిలో నీటిని నింపి బ్రహ్మూెత్సవాల ముందుగానే పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్‌ విలువ 7 ఉండేలా చూస్తారు. నెల రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే పుష్కరిణి మరమ్మత్తులు పూర్తి చేసేందుకు టిటిడి వాటర్‌ వర్క్స్‌ విభాగం ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.