MANAGUDI IN TELUGU STATES FROM AUGUST 23 TO 26-TTD CHAIRMAN_ ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ”మనగుడి” : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

Tirupati, 7 July 2018: TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav said that this year Managudi, programme will be observed in two Telugu states from August 23 to 26.

Executive Meeting on HDPP activities under the Chairmanship of Sri Sudhakar Yadav was conducted in SPRH in Tirupati on Saturday. After the meeting, speaking to media, the chairman of TTD board said, Managudi will be observed in the temples selected in twin Telugu states during the above said dates.

The board chief said, special spiritual programmes have been designed to enlighten the children especially on Hindu dharma like airing Animated mythological series, Dharma Parichaya Programmes, spiritual discourses with eminent scholars like Brahmasri Samavedam Shanmukha Sharma, Brahmasri Chaganti Koteswara Rao, Garikapati Narasimha Rao, Paripurnananda Swamy etc.

He said, to enhance spiritual fervour among the pilgrims waiting in the compartments of Vaikuntham Queue Complex, it has been decided to distribute mythological books as “Pustaka Prasadam”.

The meeting has also decided upon performing Srinivasa Kalyanam in interior areas.

Members Sri Dokka Jagannadham, Sri Ramakrishna Reddy, JEO Tirupati Sri P Bhaskar, HDPP Secretary Sri Ramanaprasad were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ”మనగుడి” : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

తిరుపతి, 2018 జూలై 07: సనాతన ధర్మప్రచారంలో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వెల్లడించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు, టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు, స్వామి పరిపూర్ణానంద, శ్రీగరికపాటి నరసింహారావు, శ్రీ సామవేదం షణ్ముఖశర్మ, శ్రీ విరజానందస్వామి తదితరులతో ఎస్వీబీసీలో ధర్మపరిచయం అనే విషయమై ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అదేవిధంగా చిన్నపిల్లల్లో ధార్మికతను పెంపొందించేలా యానిమేషన్‌ కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తామని చెప్పారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచియుండే భక్తులు చదువుకునేందుకు వీలుగా పుస్తక ప్రసాదం అందిస్తామన్నారు. తిరుమలకు రాలేని లక్షలాది మంది భక్తుల సౌలభ్యం కోసం ఆయా ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో జరిగే గ్రామదేవతల ఉత్సవాలు, జాతరలు, తిరునాళ్లు సందర్భంగా హరికథలు, ప్రవచనాలు లాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

అంతకుముందు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అర్చక శిక్షణ, శ్రీవేంకటేశ్వర ధర్మరథయాత్ర, శుభప్రదం, సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు, సదాచారం, గీతాజయంతి, అఖండ హరినామ సంకీర్తన, టిటిడి ఆలయాల్లో బ్రహ్మూెత్సవాల సందర్భంగా ధార్మిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ కమిటీ సమావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీ డొక్కా జగన్నాథం, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, ముద్రణాలయం డెప్యూటీ ఈవో శ్రీ భారతి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ ధనుంజయ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులు, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఓఎస్‌డి శ్రీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.