PUSHPA PALLAKI AT SRI PAT _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా పుష్పపల్లకీ

EO TAKES PART IN TIRUCHANOOR

TIRUCHANOOR, 02 APRIL 2022; All the local temples of TTD observed Sri Subhakrutnama Ugadi in a big way on Saturday.

TTD EO Dr. KS Jawahar Reddy took part in the Ugadi festivities held at Tiruchanoor on Saturday evening.

Earlier Snapana Tirumanjanam and Pushpa Pallaki were held at Sri Padmavathi Ammavaru temple. This fete was held between 6 pm and 7:30 pm along four Mada streets

Later in the evening, Panchanga Sravanam was held wherein EO, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, and others participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా పుష్పపల్లకీ

తిరుపతి, 2022 ఏప్రిల్ 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

కాగా, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

అనంతరం రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, డెప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరి బాయి, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.