PUSHPA PALLAKI PROVIDES CYNOSURE TO EYES_ సాయంత్రం ద‌శావ‌తారాల అలంక‌ర‌ణ‌తో పుష్ప పల్లకీ ఊరేగింపు

Tirumala, 16 July 2017: On the pleasant evening on Sunday, Sri Malayappa swamy flanked by his two consorts were taken out in a celestial procession around four Mada streets on an exquisite palanquin, daintily decorated with colourful flowers.

The “Dasavataras” concept designed on the floral palanquin provided cynosure to the eyes of pilgrims who have converged in huge numbers to witness the grandeur of Pushpa Pallaki which only happens on this celestial occasion.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna, Temple DyEO Sri Rama Rao, Peishkar Sri Ramesh and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సాయంత్రం ద‌శావ‌తారాల అలంక‌ర‌ణ‌తో పుష్ప పల్లకీ ఊరేగింపు

తిరుమల, 16 జూలై 2017 : ఈ పర్వదినం సందర్భంగా సాయంత్రం 6 నుండి 7 గం||ల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై ఆల‌య మాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మిస్తారు. పుష్ప‌ప‌ల్ల‌కీని ద‌శావ‌తారాల అంశంతో అలంక‌రించ‌నున్నారు. రంగురంగుల పుష్పాల‌తో శోభాయ‌మానంగా అలంక‌రించిన ప‌ల్ల‌కీలో ఊరేగే స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించేందుకు విశేష సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ర‌మ‌ణ‌దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ కోదండ‌రామారావు, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్క‌సం బాధ్యులు శ్రీ గురురాజారావు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.