SARE” FROM SRI RANGAM TO SRIVARU_ శ్రీ‌రంగం నుంచి శ్రీ‌వారికి సారె

Tirumala, 16 Jul. 17: In view of Anivara Asthanam, a new set of six silk vastrams brought from Sri Rangam was brought to hill shrine in a religious procession from Pedda Jiyangar mutt located adjacent to Sri Bedi Anjaneya swamy temple in ceremonious manner by HH Tirumala Sri Pedda Jiyangariyangar and HH China Jiyangar swamy of Tirumala.

Later these clothes were decorated to main deity as well to the processional deity during asthanam. TTD EO Sri AK Singhal and Tirumala Jeo Sri KS Sreenivasa Raju were also present during celestial procession of Sare.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ‌రంగం నుంచి శ్రీ‌వారికి సారె : జెఈవో

తిరుమల, 16 జూలై 2017 : ఆణివార ఆస్థానం ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా త‌మిళ‌నాడులోని ప్ర‌ముఖ పుణ్యక్షేత్ర‌మైన శ్రీ‌రంగం నుంచి శ్రీ‌వారికి కానుకగా ఆరు ప‌ట్టువ‌స్త్రాల‌తో సారెను స‌మ‌ర్పించిన‌ట్టు టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు తెలిపారు. ఈ వ‌స్త్రాల‌ను శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం ప‌క్క‌న గ‌ల శ్రీ‌ పెద్ద‌జీయంగార్ మ‌ఠం నుండి శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయంగార్‌, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయంగార్ క‌లిసి ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యంలోకి తీసుకొచ్చారని చెప్పారు. ఆణివార ఆస్థానం సంద‌ర్భంగా ఈ వ‌స్ర్తాల‌ను శ్రీ‌వారి మూల‌మూర్తికి, ఉత్స‌వ‌మూర్తుల‌కు అలంక‌రించామ‌న్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను ర‌ద్దు చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.