అప్పలాయగుంటలో పుష్పయాగానికి ఏర్పాట్లు పూర్తి

అప్పలాయగుంటలో పుష్పయాగానికి ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2018 జూలై 27: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 28వ తేదీ శనివారం నిర్వహించనున్న పుష్పయాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ ఆలయంలో జూన్‌ 23 నుంచి జూలై 1వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. శనివారం ఉదయం 11 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం చేపడతారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.