TTD TEMPLES CLOSE DOORS FOLLOWING CHANDRA GRAHANAM_ చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానికాలయాల మూత

Tirupati, 27 July 2018: All the sub-temples under the purview of TTD were closed following Sampoorna Chandra Grahanam on Friday.

The main doors of Padmavathi Ammavari temple in Tiruchanoor and Sri Kodanda Rama Swamy temple in Tirupati were closed at 3pm while those of Sri Govinda Raja Swamy temple and Sri Kapileswawa Swamy temple in Tirupati were closed at 4.30pm.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానికాలయాల మూత

తిరుపతి, 2018 జూలై 27: చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేశారు. తిరిగి శనివారం ఉదయాత్పూర్వం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం రాత్రి 11.54 గంటల నుండి శనివారం ఉదయం 3 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మూసివేశారు. శనివారం ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 5 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సర్వదర్శనం నిలిపివేసి ఆ తరువాత శుక్రవారపు ఆస్థానం, పూలంగిసేవ, రాత్రి కైంకర్యాలు, ఏకాంతసేవ ఏకాంతంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు మూశారు. మరుసటిరోజు ఉదయం 4.15 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 5.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను సాయంత్రం 5 గంటలకు మూసివేశారు. మరుసటిరోజు ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

అదేవిధంగా, చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం సాయంత్రం 3 గంటలకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, 2వ సత్రాలు, ఆసుపత్రులు, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం క్యాంటీన్‌, టిటిడి పరిపాలనా భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌ను మూసివేశారు. శనివారం ఉదయం నుండి యథావిధిగా అన్నప్రసాద వితరణ ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.