PUSHPA YAGAM AT SKVST ON MARCH 14_ మార్చి 14న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం
Tirupati, 4 March 2018: The TTD made all arrangements to conduct annual Pushpa Yagam at Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram on March 14 in a grand manner.
As part of the event on Tuesday March 13 evening, Ankurarpanam will be performed and vaikika programs will commence on Wednesday, March 14 at the Yagashala whereafter the celestial ritual of Snapana Tirumanjanam will be performed to the utsava idols of Kalyana Venkateswara Swamy along with His consorts with milk, curd, honey, turmeric, sandal paste and coconut water.
Later on the Pushpa yagam will be conducted in the afternoon with Tulasi, marigold, Ganneru, Mugali, Jasmine, Sampangi, Rose, etc and followed by veedhi utsavams.
Interested devotee couple could participate in the event at a token payment of Rs.516 for which they will beget Lord darshan and prasadam of blouse piece, Uttariyam etc.
The TTD has cancelled the Astottara Shata Kalasa abhisekam, Arjita Kalyanotsavam and others slated for March 14.
Legends say that officials or priests perform the Pushpa yagam to ward off ill effects of any misgivings and wrong doings during the daily rituals during all festivals including the Brahmotsavams conducted in the temple. Temple priests contend that by performing Pushpa yagam all Doshams will be warded off in the temple.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
మార్చి 14న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం
తిరుపతి, 2018 మార్చి 04: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 14వ తేదీన వార్షిక పుష్పయాగం వైభవంగా జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విధంగానే ఇక్కడ పుష్పయాగం నిర్వహించనున్నారు.
మార్చి 13వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది. మార్చి 14వ తేదీ బుధవారం ఉదయం 7.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 5.00 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
రూ.516/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు. శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 14వ తేదీ అష్టోత్తర శతకలశాభిషేకం, ఆర్జిత కల్యాణోత్సవంసేవలను టిటిడి రద్దు చేసింది.
ఇటీవల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.