TTD ANNOUNCES SLOTS DARSHAN FOR AGED, CHALLENGED AND PARENTS WITH INFANTS_ మార్చి 7, 21వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

MARCH 6-20 FOR AGED AND CHALLENGED

MARCH 7 AND 21 FOR PARENTS WITH INFANTS

Tirupati, 4 March 2018: As part of its commitment to provide comfortable darshan TTD has allocated darshan on two days in the month to devotees in the categories of 65-year-old, challenged and parents with below 5-year infants.

In the month of March 6 and 20 it has earmarked 4000 tokens March 6 and 20 for aged (above 65) and challenged persons. !000 persons will be given an entry in the morning 10 clock slot, 2000 in the afternoon 2pm and 1000 in the 3pm slot.

Besides these every day all the 3 category devotees were provided darshan through a special queue line twice in a day- 10 AM and 3.00 PM.The tokens were additionally granted so that devotees can plan their visits and get comfortable darshan.

Similarly, TTD has allocated special tokens for parents with infants on March 7 and 21 in the two-time slots of morning 9am and 1.30pm through the supatham entry gates. On request by devotees, the TTD has organized darshan entry to this category of devotees through the supatham gates.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 6, 20వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు,

మార్చి 7, 21వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

తిరుమల, 2018 మార్చి 04: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.

ఇందులో భాగంగా మార్చి 6, 20వ తేదీల్లో వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టిటిడి అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

అదేవిధంగా 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను మార్చి 7, 21వ తేదీల్లో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.