PUSHPAYAGAM ON SUNDAY_ జూలై 9న విజయవాడలో శ్రీవారి పుష్పయాగం

Vijayawada, 8 July, 2017: The weeklong Sri Venkateswara Vaibhavotsavams will conclude with Pushpayagam on Sunday in PWD Grounds of Vijayawada.

The deities will be given floral tribute with tonnes of varieties of flowers as a part of this ritual. This religious event takes place between 9am and 10am on July 9.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలై 9న విజయవాడలో శ్రీవారి పుష్పయాగం

విజయవాడ, 2017 జూలై 08: విజయవాడలో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం 9.00 గంటలకు శ్రీవారి పుష్పయాగంతో వైభవోత్సవాలు ఘనంగా ముగుస్తాయ.

విజయవాడ పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9.00 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించనున్నారు.

పుష్పయాగం – ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు …..

ఉత్సవ ప్రక్రియలో దోషాలు సంభవిస్తే వాటిని నివారణార్థం చేసే వైదిక ప్రక్రియ ‘పుష్పయాగం’. వివిధ రకాలైన పుష్పాలను తెచ్చి శ్రీభూసమేత మలయప్పస్వామికి వేదమంత్రోచ్చారణల మధ్య సమర్పించటమే పుష్పయాగం. ఈ పుష్పయాగంలో విశేష హోమం, స్నపన తిరుమంజనం, పుష్పసమర్పణ, కుంభ ఆవాహన కార్యక్రమాలు నిర్దేశించబడతాయి.

కాగా, పుష్పయాగాన్ని 15వ శతాబ్దంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని ప్రార్థిస్తూ స్వామివారి ద్వారా భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారని పురాణ ప్రశస్తి.

సాంస్కృతిక కార్యక్రమాలు

ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం 4.00 నుంచి 6.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఆర్‌.బుల్లెమ్మ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.