VASANTHOTSAVAM GIVES SOOTHING FEEL TO DENIZENS_ వైభవంగా శ్రీనివాసుడి వసంతోత్సవం — శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులు

Vijayawada, 8 July 2017: On the fifth day on Saturday, the denizens of Vijayawada experienced a soothing relief in PWD grounds when they witnessed the special Abhishekam of deities with aromatic ingredients.

The entire premises was caught in the finesse of the fragrance that has emanated from the divine material used for Snapana Tirumanjanam.

The deities of Srivaru flanked by Sri Devi and Bhu Devi on his either sides, seated on a special platform, rendered special abhishekam with milk, coconut water, honey, curd, sandal paste and turmeric while the priests were chanting Sri, Bu and Purusha Suktams rhythmically.

The ritual provided a feast to the eyes of devotees who thronged the PWD grounds as a part of Sri Venkateswara Vaibhavotsavams.

Finally the archakas rendered Nakshatra Harati and Kumbha Harato to deities.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వైభవంగా శ్రీనివాసుడి వసంతోత్సవం — శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులు

విజయవాడ, 2017 జూలై 08: విజయవాడలో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు.

విజయవాడ పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9.00 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు.
వసంతోత్సవం – ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు …..
వసంతఋతువులో, మలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించుటమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.

ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) శనివారం శోభాయమానంగా జరిగింది. ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు శ్రీవారి నమూనా ఆలయంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసేపాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో కురువేరు(వట్టివేరులో ఒకరకం), వట్టివేరు, రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి, మొదలగు ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు గౌ|| శ్రీ వెంకయ్యనాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నిమ్మకాయల చిన రాజప్ప, రాష్ట్ర మంత్రివర్యులు గౌ|| శ్రీ అచ్చంనాయుడు, పార్లమెంటు సభ్యులు గౌ|| శ్రీ గోకరాజు గంగరాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.