PUSHPANJALI OFFERED _ తరిగొండ వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి
TIRUMALA, 04 MAY 2023: On the 293rd Jayanti occasion of Matrusri Tarigonda Vengamamba, Pushpanjali-floral tributes were paid at Brindavanam in Tirumala on Thursday evening.
Annamachaya Project Director Dr Vibhishana Sharma, Vengamamba successors were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తరిగొండ వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి
తిరుమల, 2023 మే 04: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో గురువారం సాయంత్రం టీటీడీ అధికారులు పుష్పాంజలి సమర్పించారు.
శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించిన వెంగమాంబ 1730వ సంవత్సరంలో జన్మించారు. శ్రీ రాఘవేంద్రస్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి లాగా తన బృందావనంలోనే 1817వ సంవత్సరంలో సజీవ సమాధి చెందారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించినందుకు గుర్తుగా వెంగమాంబ పేరు ముందు మాతృశ్రీ అనే పదం చేరింది. శ్రీవారికి ఏకాంతసేవ సమయంలో అన్నమయ్య లాలి – వెంగమాంబ ముత్యాలహారతి నేటికీ కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ, శ్రీ వెంగమాంబ వంశీయులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.