SRINIVASA KALYANAM HELD _ సీతంపేట ఆల‌యంలో వైభవంగా శ్రీవారి కల్యాణం  

DEVOTEES THRONG TO WITNESS THE DIVINE WEDDING

SEETAMPETA, 04 MAY 2023: The celestial Srinivasa Kalyanam fete was observed with utmost religious grandeur and ecstasy at the Srivari temple premises in Seetampeta of Manyam district on Thursday evening.

TTD ARCHAKAS PERFORM THE FETE

A team of TTD archakas  performed the Srinivasa Kalyanam as per Vaikhanasa Agama tradition to the accompaniment of Melam and Mangala Vaidyam. The entire celestial event took place in a big way under the directives of TTD JEO Sri Veerabrahmam.

SERIES OF RITUALS IN SRINIVASA 

KALYANAM:

The various stages of Srivari Kalyanam fete included Punyahavachanam, Viswaksena Aradhana, Ankurarpanam, Maha Sankalpam, Kanyadanam, Mangalya Dharana,Varana Mayiaram and finally Harati was rendered.

DEVOTEES ENTHRALLED

The devotees were enthralled by the divine charm of the deities Sri-Bhu sameta Sri Srinivasa in their celestial splendour. The entire premises echoed to the divine chants.

Deputy EOs Sri Gunabhushan Reddy, Sri Venkataiah, Sri Siva Prasad, EE Sri Sudhakar, AEO Sri Ramesh and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సీతంపేట ఆల‌యంలో వైభవంగా శ్రీవారి కల్యాణం
 
మే 04, సీతంపేట, 2023: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం శ్రీవారి క‌ల్యాణం క‌న్నుల పండువ‌గా జరిగింది.
 
ముందుగా వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన సీతంపేట పరిసర ప్రాంతాల భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు.
 
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, ఇఇ శ్రీ సుధాకర్, ఏఈఓ శ్రీ రమేష్, డెప్యూటీ ఇఇలు శ్రీ ఆనందరావు, శ్రీ నాగరాజు, జెఈ శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.