PUSHPAYAGAM GIVES VISUAL FEAST TO DEVOTEES IN SKVST_ వైభవంగా శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

Srinivasa Mangapuram, 14 March 2018: The annual pushpayaga mahotsavam in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram provided celestial feast to the devotees on Wednesday.

Earlier during the day, the processional deities of Sri Kalyana Venkateswara Swamy flanked by Goddesses Sridevi and Bhudevi were rendered celestial bath Snapana Tirumanjanam between 10:30am and 12 noon.

Later the floral bath, Pushpayagam was performed between 2:30pm and 5pm where in tonnes of traditional and aromatic flowers were offered to the deities.

DyEO Sri Venkataiah, devotees and other office staffs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

మార్చి 10, తిరుపతి, 2018: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 14వ తేది బుధవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.

ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 5 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు.చామంతి , రోజాలు , గన్నేరు , సంపంగి , మల్లెలు , రుక్షి , కనకామ్రాలు , తామర , కలువ , మొగలిరేకులు , మాను సంపంగి పుష్పాలు, …తులసి, దవనం , మరవం , , బెల్వం , పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగ అలంకరణలో శ్రీవారి సేవకులు , ఉద్యానవన సిబ్బంది పాల్గొన్నారు. పుష్పయాగానికి 3 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు నుంచి ఒకటిన్నర టన్ను , కర్నాటక నుంచి ఒక టన్ను , ఏపీ నుంచి 500 కేజీల పుష్పాలు విరాళంగా అందాయి. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించారు.

రూ.516/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేశారు. పుష్పయాగం కారణంగా మార్చి 14వ తేదీన అష్టోత్తర శతకలశాభిషేకం, ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.

కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సి. వెంకటయ్య, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ. ఎస్.శ్రీనివాసులు , ఆలయ ఏఈవో శ్రీ. ఆర్.శ్రీనివాసులు , ఫార్మ్ మేనేజర్ శ్రీ. కె.జనార్దన్ రెడ్డి , ఇతర అధికారులు,అర్చకులు , సిబ్బంది విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.