ANKURARPANAM IN KRT ON MARCH 15_ మార్చి 15న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 14 March 2018: The Ankurarpanam for the annual brahmotsavams of Sri Kodandarama Swamy temple will be performed on March 15.

This ritual will be be observed every year on the penultimate day of Dhwajarohanam.

Meanwhile Ms Prasanna Reddy of Hyderabad donated Paradas to the temple on the occasion of annual brabhmotsavams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 15న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మార్చి 14, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 15వ తేదీన గురువారం సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. ఆలయంలో మార్చి 16 నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో చలువపందిళ్లు, ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటుచేసి రంగవల్లులు తీర్చిదిద్దారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి.

కాగా, గురువారం సాయంత్రం 6.30 గంటలకు సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7.15 నుండి 8.30 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపడతారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

16-03-2018(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

17-03-2018(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

18-03-2018(ఆదివారం) సింహ వాహనం ఉగాది ఆస్థానం/

ముత్యపుపందిరి వాహనం.

19-03-2018(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

20-03-2018(మంగళవారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం

21-03-2018(బుధవారం) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం

22-03-2018(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

23-03-2018(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం

24-03-2018(శనివారం) పల్లకీ ఉత్సవం/చక్రస్నానం ధ్వజావరోహణం.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి పరదాలు విరాళం

హైదరాబాద్‌కు చెందిన ప్రసన్నారెడ్డి అనే భక్తురాలు బుధవారం తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయానికి 29 పరదాలు, కురాళాలు విరాళంగా సమర్పించారు. వీటి విలువ రూ.3 లక్షలని దాత తెలిపారు. మూడేళ్లుగా బ్రహ్మోత్సవాల ముందుగా దాత పరదాలు, కురాళాలు విరాళంగా అందిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.