PUSHPAYAGAM IN PAT ON NOV 24_ నవంబరు 24న పుష్పయాగం

Tiruchanaur, 22 November 2017: The annual Pushpayaga Mahotsavam will be observed in Tiruchanoor temple on November 24, after the completion of Navahnika Brahmotsavams on November 23.

On this day, after the morning kainkaryams, Snapana Tirumanjanam will be observed to the processional deity of Ammavaru in Sri Krishna Mukha Mandapam on Friday at 10:30am. Later the annual Pushpayagam will be performed between 5pm to 7pm. The devotees who are willing to participate in this festival need to pay Rs.500 on which two persons will be allowed.

TTD has cancelled Kalyanotavam and Unjal seva in connection with this festival on Friday.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

నవంబరు 23న పంచమీ తీర్థం

తిరుపతి, 2017 నవంబరు 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబరు 23వ తేదీ గురువారం పంచమీ తీర్థం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఉదయం 11.48 గంటలకు మకర లగ్నంలో ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కార్తీక శుక్ల పంచమినాడు పద్మసరోవరాన్ని సేవించడమే తిరుచానూరు పంచమిగా భక్తులు పేర్కొంటారు. ఆనాడే పద్మసరోవరం నుండి అలమేలుమంగ ఆవిర్భవించి శ్రీనివాసునికి ప్రసన్నమై స్వామి తపస్సును ఫలింపజేసింది. అందుకే బ్రహ్మాది దేవతలు, ఎందరో మహర్షులు ఈ తీర్థాన్ని కొనియాడినారు. పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటుచేశారు. అదేవిధంగా పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుంది కావున భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.

నవంబరు 24న పుష్పయాగం :

నవంబరు 24వ తేదీ శుక్రవారం ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చాన నిర్వహించనున్నారు. ఉదయం 5.30 నుండి 7.00 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుంచి 7.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేస్తారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు.

కాగా నవంబరు 24వ తేదీ శుక్రవారం ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.