PUSHPAYAGAM IN SKVST ON MARCH 18 _ మార్చి 18న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

TIRUPATI, 12 MARCH 2023: The annual Pushpayagam in Sri Kalyana Venkateswara Swamy temple will be observed by TTD on March 18 with Ankurarpanam on March 17.

The annual brahmotsavams in this famous shrine were held between February 11 to 18 in a grand manner. As a “Prayaschita” to sins committed either knowingly or unknowingly by the religious, temple or even devotees, Pushpa Yagam is observed as an annual fete.

The processional deities of Sri Kalyana Venkateswara, Sridevi and Bhudevi will be rendered a floral bath on this auspicious day with several tonnes of varieties of traditional and ornamental flowers between 2pm and 4pm.

Earlier during the day Snapana Tirumanjanam will also be rendered to the processional deities between 10am and 11am.

The temple authorities have cancelled Nitya Kalyanotsavam on that day owing to the annual Pushpayagam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 18న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

తిరుపతి, 12 మార్చి 2023: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 18వ తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం మార్చి 17వ తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఆలయంలో ఫిబ్రవరి 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం .

ఇందులో భాగంగా మార్చి 18న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.

శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 18న నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.