SRI RAMA NAVAMI AND PATTABHISHEKA ASTHANAMS IN TIRUMALA TEMPLE ON MARCH 30 AND 31 _ మార్చి 30, 31వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి మరియు శ్రీరామపట్టాభిషేకం ఆస్థానాలు

HANUMANTHA VAHANA SEVA ON MARCH 30

 

TIRUMALA, 12 MARCH 2023: In connection with the auspicious Sri Rama Navami and Sri Rama Pattabhishekam on March 30 and 31, TTD is conducting the Asthanams on the respective days.

 

On the day of Sri Rama Navami on March 30, the utsava deities of Sri Sita, Lakshmana, Anjaneya Sameta Sri Rama Chandra Murthy will be seated at Ranganayakula Mandapam on a special platform and Snapana Tirumanjanam will be performed between 9am and 11am.

 

Later in the evening, Hanumantha Vahanam takes place between 6.30pm and 8pm followed by Sri Rama Navami Asthanam at Bangaru Vakili between 9pm and 10pm.

 

On March 31, Sri Rama Pattabhisheka Asthanam will be performed between 8pm and 9pm at Bangaru Vakili inside Tirumala temple.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 30, 31వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి మరియు శ్రీరామపట్టాభిషేకం ఆస్థానాలు

– మార్చి 30న‌ హనుమంత వాహన సేవ

తిరుమ‌ల‌, 2023 మార్చి 12: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30, 31వ తేదీల్లో శ్రీరామనవమి మరియు శ్రీరామ పట్టాభిషేకం పర్వదినాలను పురస్కరించుకుని టీటీడీ ఘనంగా ఆస్థానాలు నిర్వహించనుంది.

ఈ సందర్భంగా మార్చి 30న ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది. ఆ త‌రువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

మార్చి 31న రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.