PUSHPAYAGAM IN SRI GT ON JUNE 21_ శ్రీగోవిందరాజస్వామివారి పుష్పయాగ మహోత్సవము పోస్టర్లను ఆవిష్కరించిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tirupati, 15 June 2018: The annual Pushpayagam in the famous temple of Sri Govinda Raja Swamy in Tirupati will be observed on June 21.
The ankurarpanam for the same will be performed on June 20.
Tirupati JEO Sri P Bhaksar released the posters in connection with this temple fete in his chambers in TTD administrative building in Tirupati on Friday.
Temple DyEO Smt Varalakshmi was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీగోవిందరాజస్వామివారి పుష్పయాగ మహోత్సవము పోస్టర్లను ఆవిష్కరించిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
తిరుపతి, 2018 జూన్ 15: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 21వ తేదీన జరుగనున్న పుష్పయాగ మహోత్సవం పోస్టర్లను టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల బాస్కర్ శుక్రవారం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ పుష్పయాగానికి జూన్ 20వ తేదీన సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుందని తెలిపారు. మే 21 నుండి 29వ తేదీ వరకు వరకు శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయని, ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
జూన్ 21వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1.00 నుంచి 4.00 గంటల వరకు పుష్పయాగ మహోత్సవము, సాయంత్రం 5.30 గంటలకు వీధి ఉత్సవం జరుగనున్నాయని జెఈవో తెలిపారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారని వివరించారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చని, గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి ఇతర అధికార పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.