DENIZENS TAKES PART IN DHARMA RATHA YATRA_ శ్రీకాకుళం జిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర

Tirupati, 15 June 2018: Scores of denizens are participating in TTD Dharma Ratha Yatra in Srikakulam district which got commenced on June 9.

As a part of the propagation of Hindu Sanatana Dharma, TTD has taken up month long Radha Yatra in Srikakulam district which will conclude on July 9.

On June 16 the Dharma Ratham will commence from Kotturu and covers Nivagam, Baleru, Solikiri while on June 17 in Ghanasara, on June 18 in Chimara, Patapatnam, June 19 in Meliyaputti, Goppili, June 20 in Vasudevalayam and Mandasa.

On June 21 the Ratham passes through Ichapuram, T Barampuram, June 22 in Kaviti, Sompeta, June 23 Haripuram, on June 24 in T Guduru, Vajrapukotturu, June 25 in Palasa.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీకాకుళం జిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర

శ్రీకాకుళం, 2018 జూన్‌ 15: శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయడంతో పాటు సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేందుకు టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జూన్‌ 9 నుండి శ్రీకాకుళంజిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శ్రీకాకుళంజిల్లాలోని అన్ని మండలాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర జరుగుతున్నది.

జూన్‌ 16 నుండి 25వ తేదీ వరకు….

జూన్‌ 16వ తేదీన ఉదయం శ్రీకాకుళంజిల్లా కొత్తురు నుండి ధర్మరథం బయలుదేరి నివాగం, బాలేరు, సోలికిరి, జూన్‌ 17వ తేదీన ఘనాసారా, కొత్తురు, జూన్‌ 18న చీమర, పాతపట్నం, జూన్‌ 19న మెలియపుట్టి, గొప్పిలి, జూన్‌ 20న వసుదేవాలయం, మందాస మండలాల్లో ధర్మరథ యాత్ర జరుగనుంది.

జూన్‌ 21వ తేదీన ఉదయం శ్రీకాకుళంజిల్లా ఇఛ్చాపురం, టి.బరంపురం, జూన్‌ 22న కవిటి, సోంపేట, జూన్‌ 23న హరిపురం, జూన్‌ 24న టి.గూడురు, వజ్రపుకొత్తురు, జూన్‌ 25న పలస మండలాల్లో ధర్మరథం పర్యటించనుంది.

ఈ రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తుల విగ్రహాలకు భక్తులు పూజలు నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ, స్వామివారి ప్రసాదం, కంకణాలు అందిస్తారు. కావున భక్తులు స్వామివారు, అమ్మవార్ల దర్శనం చేసుకొవల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.