PUSHPAYAGAM ON NOVEMBER 1 _ నవంబరు 1న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

TIRUMALA, 30 SEPTEMBER 2022: The annual Pushpayagam will be held in Tirumala temple on November 1 between 1pm and 5pm.

TTD has cancelled Astadala Pada Padmaradhana, Arjita Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam on the day.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 1న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

తిరుమల, 2022 అక్టోబర్ 30: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 1వ తేదీన మంగళవారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబరు 31న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు  పుష్పయాగానికి అంకురార్పణ  నిర్వహించనున్నారు.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కారణంగా  అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.