PUSHPAYAGAM PERFORMED AS DWADASARADHANA MAHOTSAVAM IN VONTIMITTA_ వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

Vontimitta, 3 April 2018: The celestial fete, Sri Pushpayagam wAs performed as Dwadasaradhana Mahotsavam as per the tenets of Pancharatra Agama in Vontimitta Kodandaramalayam on Tuesday.

According to Kankanabhattar Sri Rajesh Kumar Bhattar, the Pushpayagam is performed as a Parihara Utsavam or “Sin free” festival for the mistakes committed either knowingly or unknowingly by devotees, officials or religious staff during brahmotsavams.

During this Pushpayagam Dwadasa (12) Beejaksharam of Lord as “Om Namo Bhagavate Vasudevaya” will be recited and flowers will be offered making a Padma Mandalam invoking the Lord.

The deities of Sri Sita, Lakshmana Sametha Sri Kodanda Rama were seated on a platform and varieties of flowers were offered. Pushpayagam was performed between 5pm and 7pm in grand manner.

AEO Sri Ramaraju, scores of devotees took part in this celestial fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

ఒంటిమిట్ట, 2018 ఏప్రిల్‌ 03: ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు.

కాగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహించారు. ఇందులో తులసీదళాలు, మల్లెలు, మల్లియలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, సంపంగి, మానసంపంగి, మొగళి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు.

ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రామరాజు, సూపరెంటెండెంట్లు శ్రీ సుబ్రమణ్యం, శ్రీ నాగరాజు, ఏఇలు శ్రీమతి కళావతి, శ్రీ గురుప్రసాద్‌, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.