NARASIMHA JAYANTHI AND VENGAMAMBA JAYANTHI ON APRIL 28_ ఏప్రిల్‌ 28న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి

Tirumala, 3 April 2018: The auspicious ceremonies of Narasimha Jayanthi and Tarigonda Vengamamba Jayanthi will be observed in Tirumala on April 28.

In the advent of Swathi Nakshatram in Vaisakha month, Nrisimha Jayanthi is observed in Tirumala temple. Special Abhishekam to the mulamurthi of Sri Yoga Narasimha Swamy is performed on that day.

Meanwhile pushpanjali is offered to Tarigonda Vengamamba memorial located in Tirumala. In the evening, the utsava murthies of Sri Malayappa Swamy along with Sri Devi and Bhu Devi will reach Narayanagiri Gardens and Unjal Seva is performed followed by devotional programmes.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్‌ 28న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి

ఏప్రిల్‌ 03, తిరుమల 2018: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపరభక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతిని ఏప్రిల్‌ 28వ తేదీన తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి పరిణయమండపానికి వేంచేపు చేస్తారు. రాత్రి 8 గంటల వరకు అక్కడ వెంగమాంబ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు.

ఏప్రిల్‌ 28న శ్రీ నృసింహ జయంతి

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 28న నృసింహ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో ఈ ఉత్సవం చేపడతారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.

నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయనాంచారులతో కలిసి శ్రీ మలయప్పస్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత శ్రీ యోగ నరసింహస్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.