PUSHPAYAGAM PERFORMED AT VONTIMITTA _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగం
Vontimitta, 11 Apr. 20: The annual pushpayagam was performed at Sri Kodanda Rama Swamy temple at Vontimitta on Saturday evening.
The deities of Sri Sita Lakashmana Sameta Sri Kodanada Rama Swamy were seated on a special platform at Ranganayakula mandapam and Pushpayagam was performed.
About 750 kilos of ten varieties of flowers and aromatic leaves were used for the celestial floral bath. The colourful flora included roses, sampangi, kanakambaram, chamanti, mallelu, mollalu, Tamara, vrukshi, panner leaves and Tulasi.
The fete commenced at 5pm and lasted for over two hours.
Temple DyEO Sri Lokanatham, Garden Dy Director Sri Srinivasulu were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగం
ఒంటిమిట్ట, 2020, ఏప్రిల్ 11: టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శనివారం సాయంత్రం పుష్పయాగం నిర్వహించారు. ఆలయంలో ఏప్రిల్ 2 నుండి 10వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే.
ముందుగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రాములవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేశారు. 750 కిలోలకు పైగా వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగాన్ని ఏకాంతంగా నిర్వహించారు. వీటిలో రోజాలు, కనకాంబరాలు, సంపంగి, చామంతి, మల్లెలు, మొల్లలు, తామర, వృక్షి, తులసి తదితర పుష్పాలు, పత్రాలు ఉన్నాయి. సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు పుష్పయాగం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ లోకనాథం, ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.