TTD ENSURES EXTENSIVE ANTI-COVID-19 MEASURES IN ALL ITS INSTITUTION _ టిటిడి సంస్థల్లో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు

DAILY 700 PERSONAL ENGAGED IN SANITIZATION OPERATIONS

Tirupati, 13 Apr. 20: TTD has enlarged the scope of anti-corona COVID 19 virus operations at all its organizations and employees residential quarters
after successfully addressing the sanitization issues in the TTD
administrative building and its rest houses etc. at Tirumala and in Tirupati.

The TTD Health department has roped in 700 sanitary workers for maintaining all TTD institutions spic-and-span in Tirumala and Tirupati.

Garbage removal, spraying of Sodium Hypo Chloride and bleaching powder has been taken up on a massive scale at all locations which included residential quarters of senior officials, employees residential quarters etc.

The cleaning exercises have also been extended to TTD temples and
buildings at Tirupati, Tiruchanoor, Srinivasa Mangapuram, Appalayagunta, and Chandragiri areas also.

The sanitizers and masks have been provided to employees working on shift basis at Employees canteen, Srinivasam pilgrim’s complex, Sri Padmavati Degree College Hostel, Annaprasadam complex at Tiruchanoor. All care is taken to avoid accumulation of garbage and they are regularly shifted to dumping yard.

Under the stewardship of TTD Additional Health Officer Dr B Sunil Kumar
unit officers Sri P Amarnath Reddy, Senior Sanitary Inspectors Sri M
Thyagaraja, Sri M Surya Prakash Raj, Sanitary Inspectors Sri Subba Rayudu, Sri Kulasekhara, Sanitary foreman Smt Maruti Devi and others are supervising the cleaning operations at regular intervals.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి సంస్థల్లో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు
 
 *  700 మందితో రోజూ పరిశుభ్రతా పనులు
 
తిరుపతి, 2020, ఏప్రిల్ 13: కోవిడ్ -19 వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు టీటీడీ ఇప్పటికే  తిరుమల, తిరుపతిలో మెరుగైన పరిశుభ్రత చర్యలను చేపట్టింది. సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంతో పాటు ఇతర కార్యాలయాలు, ఉద్యోగుల నివాస సముదాయాల వద్ద కరోనా వైరస్  వ్యాప్తి ని కట్టడి చేసే చర్యలను వేగవంతం చేసింది. టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 700 మంది  సిబ్బంది ఈ పనులను చేపడుతున్నారు.
 
పరిశుభ్రత పనుల్లో భాగంగా చెత్త తొలగించడం, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటివి చేస్తున్నారు. టిటిడి పరిపాలనా భవనం పరిసరాలతో పాటు కేంద్రీయ వైద్యశాల, సీనియర్ అధికారులు, జూనియర్ అధికారుల నివాస సముదాయాలు,  ఉద్యోగుల నివాస సముదాయాల్లో రోజూ  పారిశుద్ధ్య  పనులు నిర్వహిస్తున్నారు.  ఉద్యోగులకు చేతులు శుభ్రం చేసుకునేందుకు వీలుగా శానిటైజర్లు పంపిణీ చేశారు.  తిరుపతి, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట,ఆలయాల్లో పరిసరాలను శుభ్రం చేస్తున్నారు.
 
అన్నప్రసాదాలు తయారుచేసే ఉద్యోగుల క్యాంటీన్, శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్, తిరుచానూరులోని అన్నదానం కాంప్లెక్స్  లో షిఫ్టుల వారీగా పారిశుధ్య పనులు చేయడంతో పాటు అక్కడి సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య సిబ్బందికి శరీరమంతా కప్పి ఉండేలా ప్రత్యేక కిట్లు, ఎన్-95 మాస్కులు, చేతులకు గ్లౌజులు అందించారు. చెత్త పోగవకుండా ఎప్పటికప్పుడు తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
 
టిటిడి అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సునీల్ కుమార్ ఆధ్వర్యంలో యూనిట్ అధికారి శ్రీ పి.అమర్నాథరెడ్డి, సీనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీ ఎం.త్యాగరాజు, శ్రీ ఎం.సూర్య ప్రకాష్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసరావు, శ్రీ సుబ్బరాయుడు, శ్రీ కులశేఖర్, శానిటరీ మేస్త్రీ శ్రీమతి పి.మారుతి దేవి  ఈ పనులను  పర్యవేక్షిస్తున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.