PUSHPAYAGAM PROVIDES COLOURFUL FEAST TO EYES_ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శోభాయమానంగా పుష్పయాగం

Tirupati, 21 June 2018 : The annual Pushpayagam performed in Sri Govinda Raja Swamy temple provided colourful feast to the eyes of hundreds of devotees on Thursday.

TTD EO Sri Anil Kumar Singhal along with his spouse, carried the flower baskets from Anjaneya Swamy temple to Sri Govinda Raja Swamy temple where Pushpayagam was observed.

Several tonnes of traditional and ornamental flowers were used for Pushpayagam of the processional deities.

Earlier during the day Snapana Tirumanjanam was performed.

Temple DyEO Smt Varalakshmi, Garden Superintendent Sri Srinivasulu were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శోభాయమానంగా పుష్పయాగం

తిరుపతి, 2018 జూన్‌ 21: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మే 21 నుండి 29వ తేదీ వరకు వరకు శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

అనంతరం మధ్యాహ్నం 1.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ, శ్రీ ఎ.వి. శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి ఒక టన్ను, తమిళనాడు నుంచి ఒక టన్ను, కర్ణాటకనుంచి ఒక టన్ను దాతలు విరాళంగా అందించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

ముందుగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దంపతులు శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి పుష్పాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. కాగా సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, ఉద్యాన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాస్‌, ఏఇవో శ్రీ ఉదయ్‌ భాస్కర్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీజ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ ప్రశాంత్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.