YOGA FOR EMPOWERMENT OF YOUTH-TIRUPATI JEO_ యోగా ద్వారా ఆనందకర జీవితం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 21 Jun. 18: To empower the youth from the stress filled atmosphere which is predominantly prevailing today, Yoga is the best source of energy for both mind and body, said, TTD Tirupati JEO Sri P Bhaskar.

The International Yoga Day was observed in the grounds of SV Ayurvedic College on Thursday. Convened jointly by SV Ayurvedic and SVVC of TTD, students and faculty members took part and performed Yoga Asanas and Pranayama.

Later speaking on this occasion, the JEO said, India pioneered practicing yoga and meditation in their daily lives to live healthy and strong whole life some thousands of years ago. However the practice of yoga was declining day by day owing to fast growing technological environment. Especially Yoga is very much required for today’s generation to have a balance of body, mind and soul.

Today the world is looking at India for its vast wisdom of Yoga. Yoga is now observed across the world and every year 21 of June is being observed as International Yoga Day”, he added.

SV Vedic University Registrar Sri P Viswanath, TTD Dev Educational Officer Sri Ramachandra, SV Ayurvedic Principal Dr M Bhaskar, SV Oriental College Principal Sri Surendra, Students and others took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

యోగా ద్వారా ఆనందకర జీవితం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018, జూన్‌ 21: ఆధునిక జీవన విధానంలో శరీరం, మనసు, భావోద్వేగం, శక్తిని యోగ ద్వారా అదుపుచేసుకుని ఆనందకర జీవితాన్ని అలవరచుకోవచ్చని టిటిడి తిరుపతి జెఈవో మరియు శ్రీ వేంకటేశ్వర వేదిక్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ శ్రీ పోల భాస్కర్‌ పేర్కొన్నారు. 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని టిటిడి, శ్రీవేంకటేశ్వర వేదిక్‌ యూనివర్శిటీ, శ్రీ ఎస్వీ ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రాంగణంలో గురువారం టిటిడి ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జెఈవో మాట్లాడుతూ యోగా భారతదేశంలో ఉద్భవించి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది, కోట్లాదిమంది సంతోషంగా ఉండేందుకు ఉపయోగపడుతోందని అన్నారు. యోగా పుట్టిన భారతదేశంలోనే వాటి పట్ల శ్రద్ధాశక్తులు తగ్గాయన్నారు. వాటిని పూర్వ దశకు తీసుకువచ్చేందుకు జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. యోగా అత్యంత పురాతనమైనదని, వేదకాలం నుంచి దాని ప్రస్తావన ఉందని తెలిపారు. ఈ రోజుల్లో శారీరక శ్రమ తగ్గి మానసిక ఒత్తిడి పెరిగి అనేక రుగ్మతలకు గురౌతున్నారని, వీటిని అదుపుచేసి ఉత్తమ జీవితాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని అలవరచుకోవాలంటే యోగ తప్పనిసరని వెల్లడించారు. డబ్బు అవసరం లేకున్నా యోగ విద్యను అభ్యసించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం అందించామన్నారు. ఈ ఏడాది నుంచి శ్రీ వేంకటేశ్వర వేదిక్‌ యూనివర్శిటీలో యోగా శిక్షణపై 6 నెలల డిప్లమో, 3 నెలల సర్టిఫికేట్‌ పార్ట్‌టైం కోర్సులను ప్రారంభిస్తామన్నారు.

అంతకుముందు ద్రవిడ యూనివర్శిటీ పూర్వ వైస్‌ఛాన్స్‌లర్‌, విశ్రాంతాచార్యులు డా. పి.వి.అరుణాచలం మాట్లాడుతూ యోగాకు ఆది పిత శివుడని, ఆధునిక పిత పతంజలి అని గుర్తు చేశారు. త్రికరణ శుద్ధులను అదుపుచేయడానికి, చిత్తానికి అసలైన వైద్యం యోగ అని తెలియజేశారు. సర్వజన ఆమోదయోగ్యమైనదిగా యోగాను ఐ.రాస. గుర్తించి ప్రపంచమంతా యోగాదినోత్సవాన్ని జరుపుకోవాలని జూన్‌ 21వ తేదిని ప్రకటించిందని, ఇందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందన్నారు. యోగవిద్య సనాతనమైనదని, యోగాకు భారతదేశం విశ్వ గురువు అని తెలియజేశారు.

అనంతరం శ్రీ ఎస్వీ వేదిక్‌ యూనివర్శిటీ ప్రధాన యోగాచార్యులు శ్రీ రామనారాయణ పలు యోగా ఆసనాలను విద్యార్థులచే వేయించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ చేతుల మీదుగా సర్టిఫికేట్లను, బహుమతులను అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్వీ వేదిక్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ శ్రీ పి. విశ్వనాథ్‌, టిటిడి డిఈవో శ్రీ ఎం. రామచంద్ర, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌ డా. ఎం. భాస్కర్‌ రావు, ఓరియంటల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది, టిటిడి కళాశాలలు, శ్రీ ఎస్వీ వేదిక్‌ యూనివర్శిటీ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.