QUALITY MEDICARE FOR INJURED SCHOOL STUDENT- JEO (H&E) _ బధిర పాఠశాల విద్యార్థికి మెరుగైన వైద్యం
Tirupati,22 November 2023: TTD JEO for Health & Education, Smt Sada Bhargavi on Wednesday said the injured deaf boy of TTD Deaf & Dumb school would be sent to CMC Vellore for advanced treatment immediately.
The JEO who visited the Hospital upon the advice of TTD EO Sri AV Dharma Reddy said the boy has been given proper treatment already at Ruia Hospital and TTD would bear all expenses of treatment at CMC Vellore.
The facts of the case was that on Tuesday night a student from TTD Deaf school hostel had entered the store room and consumed turpentine oil and tried to create flames but caught himself in fire, started howling for help.
The Turpentine was kept in stores for ongoing painting work at the hostel and the boy had done this act on his own. The deputy warden of the school and other students who witnessed this immediately took him to Ruia Hospital for treatment.
But some social media wrongly reported the incident as an attempt of suicide by student due to some stress. Reports says that boy had attempted dousing himself on fire is baseless and unwarranted.
The JEO said the hostel officials had informed the parents of the student as well and taken swift action.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
బధిర పాఠశాల విద్యార్థికి మెరుగైన వైద్యం
– విద్యార్ధిని పరామర్శించిన జేఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2023 నవంబరు 22: తిరుపతి అలిపిరి సమీపంలోని టీటీడీ బధిర పాఠశాల వసతి గృహంలో మంగళవారం రాత్రి బి.చంద్ర అను విద్యార్థి పొరపాటున స్టోర్ రూంలోని టర్పెంటైన్ ఆయిల్ నోట్లో పోసుకొని ఊదుతూ నిప్పంటించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మంటలు పెరగడం వల్ల ఆ అబ్బాయి అరుపులు విని పక్కనే ఆడుకుంటున్న సహ విద్యార్థులు, డిప్యూటీ వార్డన్, విజిలెన్స్ సిబ్బంది దీనిని గమనించి హుటాహుటిన రుయా ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది.
ఈ అబ్బాయి పూర్తిగా టీటీడీ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడు. అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా టీటీడీ తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతొంది. అయితే కొన్ని ప్రసార మాధ్యమాలలో ఇతర విద్యార్థులు ఒత్తిడి చేశారని, ఆ క్రమంలోనే ఆ విద్యార్థి టర్పెంటైన్ ఆయిల్‌ను నోట్లో పోసుకొని నిప్పుంటించుకున్నాడని ప్రచారం చేయడం పూర్తిగా వాస్తవ విరుద్ధం. పాఠశాలలో పెయింటింగ్ వర్క్ జరుగుతున్న క్రమంలో స్టోర్లో టర్పెంటైన్ ఆయిల్ నిల్వ ఉంచడం జరిగింది. సదరు విద్యార్థి ఈ స్టోర్ రూంలోనికి వెళ్ళి తనకు తానుగా ఈ ప్రయత్నం చేశాడు.
ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల విద్యార్థులు ఆడుకుంటున్నారని, సమీపంలోని డిప్యూటీ వార్డెన్ అటెండెన్స్ తీసుకుంటున్నాడని తెలియజేయడమైనది. సంఘటన జరిగిన వెంటనే సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడమే గాక సిబ్బంది వెనువెంటనే సదరు విద్యార్థిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, జేఈవో శ్రీమతి సదా భార్గవి సదర విద్యార్థిని హాస్పిటల్‌లో పరామర్సిoచారు. . మరింత మెరుగైన వైద్య సహాయం అందించేందుకు సదరు విద్యార్థిని వేలూరు సిఎంసికి పంపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సదరు విద్యార్థిని సిఎంసిలో అడ్మిట్ చేయడం జరిగింది. ఈ విద్యార్థి వైద్యానికి అయ్యే ఖర్చును టీటీడీనే పూర్తిగా భరిస్తోందని జేఈవో తెలిపారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.