QUARTERLY METLOTSAVAM FROM JAN 8 TO JAN 10_ జనవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Tirupati, 23 Dec. 17: TTD plans to perform quarterly Srivari Metlotsavam along with Dhanurmasa rituals from January 8-10th, says Sri PR Ananda theerthacharya, OSD of Dasa sahitya project.

The three day metrlotsavam festival will commence from the Sri Govindaraja temple, near Tirupati railway station.

As part of the festival on first two days bhajan mandals will perform Suprabathan, dhayanam, and group bhajan programs from 5.00am to 7am. The bhajan mandals from AP, Karnataka, Telangana and Maharashtra will perform sankeertans from 8.30am to 12.00 noon. Dharmic discourses will be performed from 3.00pm to 6.00pm and finally bhakti sangeet and cultural events in the evening up to 8.00pm.

On Jan 8th evening the Metlotsavam shobha yatra from Sri Govindaraja Swamy Temple up to the third choultry. At the Alipiri padala mandapam on Jan 10 the Mantralayam Sri Raghavendra swami matham pontiffs Sri Subudendra theertha swamiji and other officials will perform the Metlotsavam. Later on thousands of devotees will climb the Tirumala from Alipiri mandapam singing bhajans.

Metlotsavam program was concieved by Dasa Sahitya project in memory and tribute to prominent dasas like Purandara dasa, Sri Vyasaraja theertha and saint poet Sri Annamacharya and also Vijayanagara emperor Sri Krishnadevaraya who had cametoThirumala on foot.

ISSUED BY PUB LIC RELATIONS OFFICERS, TTDs,TIRUPATI

జనవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, 2017 డిసెంబరు 22: తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో జనవరి 8 నుండి 10వ తేదీ వరకు ధనుర్మాస పూజాసహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనున్నట్టు దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీపి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ఒక ప్రకటనలో తెలిపారు. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి శ్రీ గోవిందరాజస్వామి మూడవ సత్ర ప్రాంగణములో ప్రారంభమవుతాయి.

జనవరి 8,9 తేదీల్లో ఉదయం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుండి 12.00 గంటల వరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల భజన మండళ్లతో సంకీర్తన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటల నుండి 6.00 గంటల వరకు ధార్మిక సందేశం కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

జనవరి 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. అలిపిరి పాదాల మండపంలో జనవరి 10 తేదీ ఉదయం 4.30 గంటలకు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠము శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామిజీ మరియు అధికార ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.