RADHASAPTHAMI AT SRI PAT ON JAN 24_ జనవరి 24న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

• Koil Alwar Thirumanjanam on January 23
• Snapana Thirumanjanam of Sri PAT on 24th
• All Arjita sevas cancelled on Jan.23 and 24th

Tirupati, 5 January 2018: TTD is fully geared to celebrate Rathasapthami on Janaury 24 at the Sri Padmavati Ammavari Temple wherein the presiding deity will be paraded on seven vahanas on the temple mada streets.

As part of the tradition the ritual of Koil Alwar Thirumanjanam, the cleansing of the sanctum of Sri PAT will be performed on January 23.

Salient features of the Days programs an Vahana sevas are as below:

7.00-8.00 Surya Prabha Vahanam
8.30 -9.30 Hamsa Vahanam
10.00-11.00 Ashwa vahanam
11.30 -12.30 Garuda Vahanam
1.00 -2.00 PM Chinna sesha vahanam
3.00-4.00 PM Snapana Thirumanjanam of Sri PAT
6.00-7.00 PM Chandraprabha vahanam
8.30 -9.30 Gaja Vahanam
On the same Day at 6.00 AM Lord Venkateswara on Ashwa vahanam will enthrall the devotees at the Sri Suryanarayana temple, next to Sri Padmavati Ammavari Temple.

KOIL ALWAR TIRUMANJANAM ON JAN 23 AT SRI PAT

On the ocassion of Ratha Sapthami Koil Alwar Thirumanjanam will be performed at Sri Padmavati Ammavari Temple from 8.00-9.00 after the mornig rituals of Suprabatham etc.

As part of the legendry ritual the temple sanctum, walls,puja vessels,and others will be clearned with hot water and applied traditional herbs and detergents like Namakopu, Sri Churnam, Kasturi Pasupu, Pacchaku, Gadda Karporam, Sandal power, Kunkum,Kichili gadda and perfurmed waters.

The devotees will be given darshan at Sri PAT from 9.30 AM onwards and in view of the special events on January 23 and 24, the daily arjita sevas like Kalyanotsavam,Unjal Seva etc have also been cancelled.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

జనవరి 24న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

జనవరి 23న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2018 జనవరి 05: సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 24వ తేదీ సూర్యజయంతిని పురస్కరించుకుని రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. రథసప్తమి పర్వదినాన అమ్మవారు ఒకే రోజున ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఇందులో భాగంగా అమ్మవారి వాహన సేవల వివరాలు –

సమయం వాహనం

ఉ. 7.00 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం

ఉ. 8.30 – ఉ. 9.30 హంస వాహనం

ఉ. 10.00 – ఉ. 11.00 అశ్వ వాహనం

ఉ. 11.30 – మ. 12.30 గరుడ వాహనం

మ. 1.00 – మ. 2.00 చిన్నశేష వాహనం

సా. 6.00 – రా. 7.00 చంద్రప్రభ వాహనం

రా. 8.30 – రా. 9.30 గజ వాహనం

కాగా సాయంత్రం 3.00 నుండి 4.00 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

జనవరి 23న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందురోజు జనవరి 23వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు.

ఆనంతరం ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

కోయల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, ఊంజలసేవలను రద్దు చేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.