IDENTIFYING PLACES TO CONSTRUCT REST HOUSES IN TIRUPATI-EO

Tirumala, 5 January 2018: To accommodate pilgrims in Tirupati, TTD is locating places in the temple city to construct rest houses, said TTD EO Sri AK Singhal.

After Dial Your EO Programme, speaking to media persons, the EO said, as slotted sarva darshan (SSD) is on chords from second week of March with some counters starting in Tirupati, TTD is contemplating to construct some rest houses in Tirupati to facilitate pilgrims as there is dearth of accommodation in Tirumala.

“Our CE Sri Chandrasekhar Reddy and his team are working out on this and will soon come out with a detailed plan”, he added.

On the filling up of the post of CEO SVBC, the EO said, 15-16 applications have been received for the post. After scrutiny, the vacancy will be filled up. On the action on the alleged allegations of misappropriation by former CEO SVBC, the EO said, CVSO has already submitted his report. The CEO will give his explanation in next two or three days”, he maintained.

Elaborating on the issue of 44 non-Hindu employees who are working in TTD, the EO said, we have already served notices to them seeking their explanation. “As per our guidelines, till the rule of 1989 there is no restriction on recruitment process in TTD. From 1989-2007 the recruitment of persons professing Hindu religion was implied only to non-teaching category. While as per the amended rule of 2007, non-Hindus will not be recruited either in Teaching or Non-teaching categories of TTD. During our findings we have identified 44 such persons who are working in TTD deviating the guidelines. Among them 39 were recruited between 1989-2007 while remaining in 2007. Majority of them are employed under compassionate category while some NMRs escalated to regularisation. We are now contemplating to send them to other state government departments in the equivalent cadres and scales”, he briefed.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

జనవరి 5, తిరుమల 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు.

సమయ నిర్దేశిత సర్వదర్శనం విజయవంతం : భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేందుకు డిసెంబరు 18 నుంచి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శన విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ 6 రోజుల్లో మొత్తం 96,047 టోకెన్లు జారీ చేశాం. మార్చి రెండో వారం నుంచి తిరుమలతోపాటు తిరుపతిలోనూ పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అమలుచేస్తాం. తిరుపతిలో భక్తులు బస చేసేందుకు వీలుగా విశ్రాంతిగృహాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.

ఆర్జితసేవల లక్కీడిప్‌ నమోదులో స్వల్ప మార్పు : శ్రీవారి ఆర్జితసేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ నమోదు ప్రక్రియలో స్వల్పమార్పు చేపట్టాం. గతంలో నమోదు చేసుకునేందుకు 7 రోజుల సమయం ఉండేది. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఈ నమోదు సమయాన్ని 4 రోజులకు కుదించాం. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆ తరువాత 3 రోజుల్లోపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనం : వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా రికార్డుస్థాయిలో 1.75 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించాం. ఈ అనుభవంతో భవిష్యత్తులో మరింత మెరుగైన సౌకర్యాలను భక్తులకు అందిస్తాం.

ప్రత్యేక దర్శనాలు : జనవరి 9, 29వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు ఉదయం 10 గంటలకు 1000, మధ్యాహ్నం 2 గంటలకు 2000, మధ్యాహ్నం 3 గంటలకు 1000 మందికి కలిపి మొత్తం 4 వేల మందికి దర్శనం కల్పిస్తాం. ఈ సౌకర్యాన్ని వ ద్ధులు, దివ్యాంగులు వినియోగించుకోవాలి. రద్దీ రోజుల్లో వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ రెండు రోజుల్లో స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం.

– జనవరి 10, 30వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ప్రవేశమార్గం ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తాం.

జనవరి 24న రథసప్తమి : జనవరి 24న సూర్యజయంతిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో రథసప్తమి జరుగనుంది. ఈ సందర్భంగా ఒకేరోజు 7 ప్రధాన వాహనాలపై శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. దీనిని ఒకరోజు బ్రహ్మూెత్సవంగా వ్యవహరిస్తారు.

టిటిడి డైరీలు, క్యాలెండర్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌కు విశేష స్పందన: ఈ ఏడాది మొదటిసారిగా ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టిన డైరీలు, క్యాలెండర్ల బుకింగ్‌కు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

– ఇప్పటికే 33 వేలకు పైగా డైరీలు, క్యాలెండర్లను పోస్టల్‌ శాఖ ద్వారా సకాలంలో భక్తులకు చేరవేయడమైనది.

అదేవిధంగా, ఈవో మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో వచ్చిన ఆరోపణలపై సివిఎస్‌వో విచారణ చేపట్టి నివేదిక రూపొందించినట్టు తెలిపారు. ఈ నివేదికను పరిశీలించి ఈ నెలాఖరులోపు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్వీబీసీ సిఈవో పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు. టిటిడి ఉద్యోగుల్లో 44 మంది అన్యమతస్తులు ఉన్నట్టు గుర్తించామని, వారికి నోటీసులు పంపామని చెప్పారు. ఉద్యోగుల నుంచి వివరణ అందాక తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 1989వ సంవత్సరం వరకు మతంతో సంబంధం లేకుండా టిటిడిలో నియామకాలు జరిగాయని, 2007వ సంవత్సరం వరకు టీచింగ్‌ పోస్ట్ లకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని , మిగిలిన అన్ని పోస్టులకు హిందువులు మాత్రమే అర్హులని, 2007వ సంవత్సరం తరువాత అన్ని ఉద్యోగాలకు హిందువులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నిబంధనలు ఉన్నాయన్నారు. 1989 నుంచి 2007వ సంవత్సరం వరకు 39 మంది, 2007వ సంవత్సరం తరువాత 5గురు అన్యమతస్తులు ఉద్యోగాలు పొందినట్టు గుర్తించామన్నారు. టిటిడి ఉద్యోగులెవరైనా అన్యమత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.