RADHASAPTHAMI IN SRI KRT_ జనవరి 24న శ్రీ కోదండరామాలయంలో రథసప్తమి

Tirupati, 19 January 2018: The important religious event of Radhasapthami will be observed in Sri Kodanda Rama Swamy temple in Tirupati on January 24.

On this special occasion, Lord Sri Kodanda Rama will take celestial ride on Surya Prabha and Chandra Prabha vahanams at 8am and 7pm respectively.
Temple authorities are making elaborate arrangements for the big day.

SRI KRT DEITIES PROCESSION IN KUPCHANDRAPETA

The procession of utsava murthies including Sri Kodanda Rama, Sita Devi and Lakshmana Swamy will be taken to Kupchandrapeta village on February 1 on the occasion of Magha Pournami.

Snapana Tirumanjanam is performed to deities on this occasion here and later returns to temple in the night by 9pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

జనవరి 24న శ్రీ కోదండరామాలయంలో రథసప్తమి

తిరుపతి, 2018 జనవరి 19: జనవరి 24వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి పర్వదినాన తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సూర్యప్రభ వాహనం, చంద్రప్రభవాహనంపై శ్రీకోదండరామస్వామివారువారు ఊరేగనున్నారు.

ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8.00 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7.00 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

ఫిబ్రవరి 1న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు

మాఘపౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీ శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.

శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6.00 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.00 గంటలకు చేరుకుంటాయి. అక్కడ ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఊంజల్‌సేవ చేపడతారు. సాయంత్రం 5.00 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9.00 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.