TIRUCHANOOR TEMPLE TO BE CLOSED FOR 12 HOURS ON JAN 31_ జనవరి 31న చంద్రగ్రహణం ఉదయం 9.30 గం||ల నుంచి రాత్రి 9.30 గం||ల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం మూత

Tirupati, 19 January 2018: Following Lunar eclipse on January 31, the doors of the famous temple of Goddess Padmavathi Devi at Tiruchanoor remain closed from 9:30am to 9:30pm on that day for about 12 hours.

The temple doors will be reopened after performing Punyahavachanam, Suddhi and Ekanta Seva will be perofrmed.

Temple authorities have cancelled all arjitha sevas on January 31 and Tiruppavada Seva on February 1 owing to total lunar eclipse.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

జనవరి 31న చంద్రగ్రహణం ఉదయం 9.30 గం||ల నుంచి రాత్రి 9.30 గం||ల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం మూత

తిరుపతి, 2018 జనవరి 19: చంద్రగ్రహణం కారణంగా జనవరి 31వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం తలుపులు మూసివేస్తారు.

జనవరి 31న సాయంత్రం 5.53 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు, ఏకాంతసేవ నిర్వహిస్తారు.

చంద్రగ్రహణం కారణంగా జనవరి 31న ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఫిబ్రవరి 1వ తేదీ తిరుప్పావడ సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.