RADHOTSAVAM OBSERVED IN SKVST_ భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు
Srinivasa Mangapuram, 3 Mar. 19: The procession of the mammoth wooden chariot was observed in Srinivasa Mangapuram as a part on the ongoing annual brahmotsavams on Sunday morning.
Sri Kalyana Venkateswara Swamy flanked by Sridevi and Bhudevi on either sides was seated majestically on the platform in a wooden chariot.
The giant cart was pulled along the mada streets encircling the shrine. Devotees made a beeline to watch the grand procession.
Temple DyEO Sri Dhananjayulu, AEO Sri Lakshmaiah, Chief Priest Sri Balaji Rangacharyulu, Supdt Sri Changalrayulu, Temple Inspector Sri Anil and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు
తిరుపతి,2019 మార్చి 03: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.15 నుండి 8.15 గంటల వరకు ఉభయదేవేరులతో కూడి శ్రీవారు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది. శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన స్వామివారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నారు పెద్దలు.
అనంతరం సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అశ్వ వాహనం :
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీ రమేష్‌రెడ్డి, ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ ధనంజయులు, విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్, డెప్యూటీ ఇఇ శ్రీ రవిశంకర్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మయ్య, ప్రధాన కంకణబట్టార్ శ్రీబాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మార్చి 4న చక్రస్నానం :
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన సోమవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 7.30 నుండి 9.00 గంటల వరకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.00 గంటల వరకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.