RAJAMANNAR ON KALPAVRIKSHA _ కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

TIRUPATI, 03 MARCH 2024: As a part of the ongoing annual brahmotsavams in Srinivasa Mangapuram, on the fourth day morning, Sri Kalyana Venkateswara as Rajamannar blessed His devotees on Kalpavriksha Vahanam on Sunday.

The dance troupes including Koalatam, Chekka Bhajana, added the glamour to the carrier fete.

CPRO and Special Officer of the temple, Dr T Ravi, Spl Gr DyEO Smt Varalakshmi and others were present.

IMPRESSIVE CHANDA MELAM IN KALPAVRIKSHA VAHANA SEVA

Tirupati, 03 March 2024: As part of Sri Kalyana Venkateswara Swamy Brahmotsavam at Srinivasaangapuram, Chanda Melam, Kolatam, Chakka Bhajans and other artistic performances impressed the devotees durimg the Kalpavriksha Vahanaseva on Sunday morning. 

These exhibitions were organized under the auspices of TTD Hindu Dharma Prachara Parishad and Dasa Sahitya Project.

Chandamela (Kerala Drums) is played by Sri Veeranjaneya Group from Udupi, Karnataka. 

The Kerala Drums Ensemble has a total of 18 artists.  They played drums and cymbals rhythmically and dance accordingly.  The performance of this instrument was entertaining.

Similarly, 20 local women artistes of Sri Vaibhava Venkateswara Kolata Bhajan Team under the direction of Smt. Revathi from Tirupati impressed the devotees with their Kolatams and dances dressed as Koyas. 

Kolatam and chakka bhajans were performed by female students aged 7 to 12 years of Sri Abhaya Anjaneya Kolata Bhajan Troupe of Kealapudi. 

Kolatms by 20 artistes of Sri Sai Lakshmi Srinivasa Bhajan Troupe from Tanguturu and 20 artistes from Gajulamandyam attracted the devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

తిరుపతి, 2024 మార్చి 03: శ్రీనివాసమంగపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చర్నాకోలు , దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.

ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌వి, ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ వెంక‌ట‌స్వామి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

క‌ల్ప‌వృక్ష వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్నచండ మేళం

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం ఉదయం క‌ల్ప‌వృక్ష‌ వాహ‌న‌సేవ‌లో చండ మేళం, కోలాటం, చక్క భజనలు త‌దిత‌ర క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశారు.

క‌ర్ణాట‌క‌ రాష్ట్రం ఉడిపికి చెందిన శ్రీ వీరాంజ‌నేయ బృందం చండ‌మేళం(కేర‌ళ డ్ర‌మ్స్‌) వాయిస్తున్నారు. కేర‌ళ డ్ర‌మ్స్‌ బృందంలో మొత్తం 18 మంది క‌ళాకారులు ఉన్నారు. వీరు డ్ర‌మ్స్‌, తాళాలు ల‌య‌బ‌ద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. ఈ వాయిద్య ప్ర‌ద‌ర్శ‌న అలరించింది

అదేవిధంగా, తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి రేవ‌తి ఆధ్వ‌ర్యంలో శ్రీ వైభ‌వ వేంక‌టేశ్వ‌ర కోలాట భ‌జ‌న బృందంలోని 20 మంది స్థానిక మ‌హిళా కళాకారులు కోయ‌వాళ్ళ వేష‌ధార‌ణ‌లో కోలాటాలు, నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కీల‌పూడికి చెందిన శ్రీ అభ‌య ఆంజ‌నేయ‌ కోలాట భజన బృందములోని 7 నుండి 12 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల విద్యార్థిని విద్యార్థులు కోలాటం, చ‌క్క భ‌జ‌న‌ల ప్రదర్శన చేశారు. టంగుటూరుకు చెందిన శ్రీ సాయి ల‌క్ష్మీ శ్రీ‌నివాస భ‌జ‌న బృందంలోని 20 మంది క‌ళాకారులు, గాజుల‌మండ్యంకు చెందిన 20 మంది క‌ళాకారుల కోలాటాలు భ‌క్తుల‌ను ఆక‌ర్షించాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.