RAMACHANDRA RIDES ON HAMSA _ హంస వాహనంపై శ్రీ కోదండరాముడి అభయం

Tirupati, 06 April 2024: On Saturday evening as part of the ongoing annual Brahmotsavam at Sri Kodanda Rama Swamy temple in Tirupati, Sri Ramachandra Murty took a celestial ride on Hamsa Vahanam to bless His devotees.

The parade was lead by caparisoned elephants, amidst grand Kolatams and Vaidyams by artists along temple streets.

Devotees were seen rendering Harati to the majestic Sri Rama who sat atop Hamsa with royalty.

Both the seers of Tirumala, DyEOs Sri Govindarajan, Smt Nagaratna and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హంస వాహనంపై శ్రీ కోదండరాముడి అభయం

తిరుపతి, 2024 ఏప్రిల్ 06: తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ‌నివారం రాత్రి 7 గంట‌ల నుండి హంస వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు అభయమిచ్చారు.

గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, కంకణభట్టర్ శ్రీ సీతారామాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.