RAMACHANDRA SHINES ON CHANDRAPRABHA VAHANAM _ చంద్రప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

TIRUPATI, 26 MARCH 2023: Sri Rama dazzled on Chandraprabha Vahanam on a pleasant evening on Sunday.

Braving the showers devotees thronged all through the mada streets to witness the soothing Chandraprabha Vahanam.

Both the senior and junior pontiffs of Tirumala, DyEO Smt Nagaratna, AEO Sri Mohan, Kankanabhattar Sri Anandakumar Deekshitulu, Superintendent Sri Ramesh and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్రప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

తిరుపతి, 2023 మార్చి 26: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ఆదివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. చిరుజల్లుల నడుమ భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఏఈవో
శ్రీ మోహన్, కంకణబట్టర్ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌ కుమార్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ చలపతి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.