RAMAKRISHNA THEERTHAM ARRANGEMENTS REVIEWED _ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష

TIRUMALA 19 JANUARY 2024:The TTD Additional EO(FAC) Sri Veerabrahmam has reviewed the arrangements on Sri Ramakrishna Theertha Mukkoti which is scheduled on January 25.

In the review meeting held at Gokulam Conference Hall on Friday evening, he directed the officials concerned to make all necessary arrangements as it is considered one of the important torrent festivals being observed in Tirumala.

He instructed the Engineering wing to lay the Shamiana, Radio and Broadcasting announcements, and display boards for the sake of visiting pilgrims.

Similarly, he reviewed Security arrangements by TTD sleuths and police in coordination, besides Annaprasadam, water, medical, health, and forest wings.

He instructed the Chief PRO Dr T Ravi to give wide publicity in media that devotees with obesity, asthma, heart problems, and other chronic diseases and also aged persons will not be allowed. He also directed the temple staff to complete the puja in the torrent on time.

The APSRTC is arranging 30-35 buses to transport the pilgrims from the Gogarbham dam point to Papavinasanam. The devotees will also be allowed to trek the torrent path only from 5 am onwards till noon on January 25.

SE2 Sri Jagadeeshwar Reddy, VGO Sri Giridhara Rao, DyCF Sri Srinivasulu, Health Officer Dr Sridevi, Aswini Hospital Chief Surgeon Dr Kusuma Kumari, temple Peishkar Sri Srihari, Catering Special Officer Sri Sastry and other TTD, Police, RTC, Fire department officials were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష

తిరుమల, 2024 జనవరి 19 ; తిరుమలలో జనవరి 25న జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో(ఎఫ్‌ఏసి) శ్రీ వీరబ్రహ్మం శుక్రవారం సాయంత్రం తిరుమల గోకులం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటి కనుక అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాత్రికుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.

అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, వృద్ధులను అనుమతించబోమని మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలని చీఫ్‌ పీఆర్‌వో డా. టి.రవిని ఆదేశించారు. తీర్థం వద్ద పూజలు సకాలంలో పూర్తి చేయాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు.

కాగా, గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ 30 నుండి 35 బస్సులను ఏర్పాటు చేస్తోంది. జనవరి 25వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు.

ఈ సమీక్షలో ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజివో శ్రీ గిరిధరరావు, డెప్యూటీ సిఎఫ్ శ్రీ శ్రీనివాసులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, అశ్విని హాస్పిటల్ చీఫ్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి, ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి, కేటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, ఇతర టీటీడీ, పోలీస్, ఆర్టీసీ, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.
   
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.