RAMANUJA AVATAROTSAVAMS CONCLUDES _ ముగిసిన శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు

ముగిసిన శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు
 
ఏప్రిల్‌ 25,  తిరుపతి 2023: టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మూడు రోజుల పాటు జరిగిన రామానుజాచార్యుల అవ‌తార మ‌హోత్స‌వాలు మంగళవారం ముగిశాయి.
 
ఈ సంద‌ర్భంగా అల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సలహాదారు హైదరాబాద్ కు చెందిన శ్రీ కేకే పరకాలన్  ‘రామానుజ చతుశ్లోకి’ అనే అంశంపై ఉపన్యసించారు.
 
అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ జి. మధుసూదన్ రావు బృందం అన్నమాచార్య సంకీర్తనలను మృదుమధురంగా ఆలపించారు.
 
ఈ కార్యక్రమంలో ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఏఈఓ శ్రీ శ్రీరాములు, ప్రోగ్రాం కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తం, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 25 April 2023: The three day Sri Ramanuja Avatarotsavams concluded on a spiritual note at Annamacharya Kalamandiram on Tuesday evening at Tirupati.

Alwar Divya Prabandha Project Advisor from Hyderabad Sri Parakalan given lecture on Ramanuja Chatushloki on the occasion.

Alwar Divya Prabandha Project AEO Sri Sriramulu, Program Coordinator Sri Purushottam and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI