RAMANUJACHARYA BROUGHT REFORMATION THROUGH BHAKTI _ భక్తి ఉద్యమంతో సంఘాన్ని సంస్కరించిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు : ఆచార్య చక్రవర్తి రంగనాథన్

TIRUPATI, 24 APRIL 2023: The great Sri Vaishnava Saint Sri Ramanujacharya brought reformation in the society through Bhakti cult said National Sanskrit Varsity Professor Chakravarthi Ranganathan.

 

As part of the literary session arranged at Annamacharya Kalamandiram in Tirupati on Monday evening in connection with 1008th Avatara Mahotsavam Sri Ranganathan spoke about Ramanuja and Sri Bhashyam. He said the credit was owned by Sri Ramanujacharya by writing Sri Bhashyam to Brahma Sutrams.

 

Later Annamacharya Project artist Smt Nagamani rendered Harikatha.

Alwar Divya Prabandha Project AEO Sri Sri Ramulu, Co-ordinator Sri Purushottam, denizens were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తి ఉద్యమంతో సంఘాన్ని సంస్కరించిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు : ఆచార్య చక్రవర్తి రంగనాథన్

తిరుపతి, 2023 ఏప్రిల్ 24: భక్తి ఉద్యమంతో సమానత్వాన్ని బోధించి సమాజాన్ని సంస్కరించిన మహనీయుడు భగవద్‌ రామానుజాచార్యులని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు డా.చక్రవర్తి రంగనాథన్ పేర్కొన్నారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న రామానుజాచార్యుల అవ‌తార మ‌హోత్స‌వాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సంద‌ర్భంగా ఆచార్య చక్రవర్తి రంగనాథన్ ‘రామానుజులు – శ్రీభాష్యం’ అనే అంశంపై ఉపన్యసిస్తూ భగవద్‌ రామానుజులు రచించిన నవరత్నాల వంటి 9 గ్రంథాలలో ”శ్రీభాష్యం” ఒకటన్నారు. వేదవ్యాసులవారు రచించిన బ్రహ్మ సూత్రాలకు భగవత్ రామానుజులవారు వ్యాఖ్యానం వ్రాయగా సాక్షాత్తు శ్రీ సరస్వతి అమ్మవారు అనుగ్రహించినట్లు తెలిపారు. ఇందులో మొత్తం నాలుగు అధ్యాయాలు, 545 సూత్రాలకు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా అనుగ్రహించారని చెప్పారు.

ఇందులో సమస్త చరాచర జగత్తులో సృష్టి, స్థితి, లయ కారకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అని శ్రీభాష్యంలో వివరించినట్లు తెలిపారు.

బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యం రచించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరు పరబ్రహ్మ జ్ఞానాన్ని పొంది తద్వారా ధర్మార్ధ కామ మోక్షాలలో మోక్షం పొందవచ్చని చెప్పారు. శరణాగతికి మూలం నమ్మకమని, భగవంతునిపై అనన్యమైన ప్రేమను ప్రదర్శించడమే భక్తి అని, ఇందులో శరణాగతి ముఖ్యమైనదని వివరించారు.

అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ‌మ‌తి నాగమణి బృందం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఏఈఓ శ్రీ శ్రీరాములు, ప్రోగ్రాం కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తం, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.