RAMANUJACHARYA JAYANTHI FETE COMMENCES_ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ రామానుజాచార్యుల 1002వ అవతార మహోత్సవాలు ప్రారంభం

Tirupati, 19 April 2018: The 1002 Avatarotsavam of Saint Sri Ramanujacharya commenced on a religious note in Tirupati on Thursday evening.

Tirumala Chinna Jiyar Swamy rendered his Anugraham Bhashanam to this three day fete commenced in Annamacharya Kalamandiram under the aegis of Alwar Divya Prabandha Project of TTD.

This fete will conclude on Saturday on the birth Anniversary day of Sri Ramanujacharya.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ రామానుజాచార్యుల 1002వ అవతార మహోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 19: టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల 1002వ అవతార మహోత్సవాలు గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా టిటిడి శ్రీశిరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్‌స్వామి మంగళాశాసనాలు అందించారు. ఆదిశేషుని అవతారమైన భగవద్‌ రామానుజులు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారని తెలిపారు. శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడని, భగవద్‌ రామానుజులు ఈ మార్గాన్నే అనుసరించారని వివరించారు. రామానుజార్యుల 1002వ అవతార మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా ప్రాంతాల్లో టిటిడి నిర్వహించడం ముదావహమన్నారు.

అనంతరం తిరుపతికి చెందిన ఆచార్య సంపత్ కుమారాచార్యులు ”శ్రీ రామానుజ వైభవం”, తిరుపతికి చెందిన ఆచార్య టివి.రాఘవాచార్యులు ”శ్రీభాష్యం” అనే అంశాలపై ఉపన్యసించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.