ANNAMAIAH JAYANTHI POSTERS RELEASED_ శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

Tirupati, 19 April 2018: TTD JEO Sri Pola Bhaskar on Thursday released the posters of 610th Jayanthi festival of Saint Poet Sri Tallapaka Annamacharya in his chambers in TTD administrative building, TTD will observe week long fete in Tallapaka, Tirupati and Tirumala from April 29 to May 5 in a big way.

Annamacharya Project Spl Officer Sri Dhanajeyulu was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుపతి, 2018 ఏప్రిల్ 19: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 610వ జయంతి ఉత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్ గురువారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 29 నుండి మే 5వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించనున్నట్టు తెలిపారు.

తాళ్లపాకలో..

కడప జిల్లా తాళ్లపాకలోని ధ్యానమందిరంలో ఏప్రిల్ 29వ తేదీన ఉదయం సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. మే 1న శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది. ఏప్రిల్ 29 నుండి మే 1వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 9.30 గంటల వరకు ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.

తిరుపతిలో..

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఏప్రిల్ 29 నుండి మే 5వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సులు, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మహతి కళాక్షేత్రంలో ఏప్రిల్ 29 నుండి మే 1వ తేదీ వరకు సాయంత్రం 6.00 నుండి సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.